ఈటలతో బీజేపీ కొత్త ఎత్తుగడ…ఫిక్స్ చేసుకున్నారా?

-

తెలంగాణ బీజేపీలో రాష్ట్ర స్థాయిలో ప్రజలని ఆకట్టుకునే నాయకులు ఉన్నారా? అంతగా లేరనే చెప్పొచ్చు. ఏదో ఆయా నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థానాల పరిధి వరకు పేరున్న నాయకులు ఉన్నారు గానీ, టీఆర్ఎస్., కాంగ్రెస్‌లో ఉన్నట్లు రాష్ట్ర స్థాయిలో ప్రజలని ఆకట్టుకునే నాయకులు పెద్దగా లేరని చెప్పొచ్చు. టీఆర్ఎస్‌లో కేసీఆర్‌ మెయిన్ పిల్లర్ కాగా,  ఆ తర్వాత హరీష్, కేటీఆర్‌లతో పాటు పలువురు బడా నాయకులు టీఆర్ఎస్‌కు పెద్ద దిక్కుగా ఉన్నారు.  అటు కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో నడుస్తోంది. ఇప్పుడే ఆయనే కాంగ్రెస్‌కు దిక్కు.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

అలాగే కాంగ్రెస్‌లో కొందరు పేరున్న నాయకులు కూడా ఉన్నారు. ఇటు బీజేపీ విషయానికొస్తే కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రమే కనిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కిషన్ రెడ్డికే రాష్ట్రంలో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. అధ్యక్షుడు అయ్యాక బండి కూడా దూకుడుగా రాజకీయాలు చేయడం వల్ల, కాస్త హైలైట్ అవుతున్నారు. అయితే కిషన్ రెడ్డి..కేంద్ర మంత్రి కావడంతో రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. దీంతో రాష్ట్రంలో బీజేపీని పైకి తీసుకొచ్చే నాయకులు కనబడటలేదు. అయితే ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌ని బీజేపీ, రాష్ట్ర స్థాయిలో వాడుకుని, కేసీఆర్‌కు చెక్ పెట్టాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

దశాబ్దాల పాటు టీఆర్ఎస్‌లో పనిచేసిన ఈటలకు రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చాక రాజేందర్‌కు ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఇక ఈయన గానీ హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిస్తే, బీజేపీ ఇంకా ఈటల రాజేందర్‌ని రాష్ట్ర రాజకీయాల్లో వాడుకుంటుందని తెలుస్తోంది. ఈటలని రాష్ట్ర స్థాయిలో తిప్పుతూ, పార్టీని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి హుజూరాబాద్ ఫలితం తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఎలా మారుతాయో?

Read more RELATED
Recommended to you

Exit mobile version