జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో ప్రచారం చేయకపోవడం వెనుక ప్రధాన కారణం ఏంటి అనేది తెలియకపోయినా సరే పవన్ కళ్యాణ్ ని ప్రచారానికి తీసుకువెళ్ళే విషయంలో మాత్రం బీజేపీ నేతలు తప్పు చేస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి కాపు సామాజికవర్గం అండగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అవుతుంది. ఆ సామాజిక వర్గంలో కీలక నేతలతో సమావేశం కూడా కావడం లేదు. జనసేన పార్టీకి అండగా నిలిచిన కొంతమంది కాపు సామాజికవర్గ నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడకపోవడం పట్ల ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కొన్ని కొన్ని అంశాల్లో పార్టీకి సహకరించకపోవడంతో చాలామంది నాయకులు కూడా ఆగ్రహం గానే ఉన్నారు. అయితే జనసేన పార్టీ నేతలు ప్రచారానికి వచ్చే విషయంలో ఇబ్బందులు పడుతున్న సరే వారితో మాట్లాడి పార్టీలో ముందుకు నడిపించే ప్రయత్నం మాత్రం చేయలేక పోతున్నారు.
దీంతో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రచారానికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇక ప్రచార సమయం కూడా దాదాపుగా ముగిసిపోవడంతో పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి వచ్చే అవకాశం దాదాపుగా లేదని చెప్పాలి.