హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన పార్టీలన్నింటికీ ఈ ఉప ఎన్నిక అగ్ని పరీక్షగా మారింది. అధికార టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉప ఎన్నికను అ త్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగరవేయడం ద్వారా ప్ర జామోదం తమకు ఉందని చెప్పుకోవడంతోపాటు , తమ పాలనపై విపక్షాల ఆరోపణలన్నింటికీ చెక్ పె ట్టాలని టీఆర్ ఎస్ యోచిస్తోంది.
మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం ద్వారా టీఆర్ ఎస్‌కు తామే ప్రత్యాయ్నాయం అనే సం కేతాలివ్వడంతోపాటు , రాష్ట్రంలో బలపడాలనుకుంటున్న బీజేపీని వెనక్కి నెట్టాలని కాంగ్రెస్ భా విస్తోం ది. ఈక్రమంలోనే ఆటు టీఆర్ ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు తీ వ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే అందరి కంటే ముందే టీఆర్ఎస్ తన అభ్యర్థిగా సైదిరెడ్డిని ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ కూడా తమ పార్టీ అభ్యర్థిగా పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డిని ప్రకటించింది.
ఇక బీజేపీ కూడా నేడో రేపో తన పార్టీ అభ్యర్థిని ప్రకటించనుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అ భ్యర్థిగా శ్రీకళారెడ్డిని పోటీకి దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ భారీ కస కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ ఎస్ , కాంగ్రెస్‌ల నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు పోటీ లో ఉన్న నేపథ్యంలో… బీజేపీ నుంచి కూడా అదే సామాజికవర్గానికి చెందిన నేతను బరిలో నిలపాలని పార్టీ భావిస్తోంది.
రాష్ట్రంలో టీఆర్ ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం చెప్పకుంటున్న బీజేపీకి హుజూర్‌నగర్ ఉప ఎన్నిక అగ్నిపరీక్షగా మారింది. కాగా 2018 ఉప ఎన్నికల్లో హుజూర్‌నగర్ ని యోజకవర్గంలో బీజేపీకి తీ వ్ర పరా భవం ఎదురైంది. నోటా కంటే బీజేపీకి తక్కువ గా ఓట్లు పోలవడం గమనార్హం. ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 1500 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే గత అనుభవం నుంచి ఆ పార్టీ పాఠాలు నేర్చుకున్నట్లే కనిపిస్తోంది. ఈక్రమంలోనే ఈసారి ఎలాగైనా చెప్పుకోదగ్గ ఓట్లు సాధించి, పరువు నిలుపుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. మరి బీజేపీ ఆశలు ఎలా ? నెరవేరతాయో ? చూడాలి.