బిజెపి సినిమా యాక్టర్స్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తుంది – సిపిఐ నారాయణ

-

కేసీఆర్ బీహార్ వెళ్లి అక్కడి నాయకులను కలవడం ఒక ముఖ్య ఘటన అని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బీజేపీ వ్యతిరేక కూటమిని కలిసినందుకు కేసీఆర్ ని అభినందిస్తున్నానని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తులని కేసీఆర్ కలవాలని సూచించారు. ఆప్ నాయకుల విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కొండను తవ్వి ఎలుకని పట్టుకున్నాయని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ బీజేపికి వ్యతిరేకంగా మారారు కాబట్టే కేంద్ర సంస్థలు ఆయన్ని టార్గెట్ చేశాయన్నారు. బీజేపీ సినిమా యాక్టర్స్ కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు సిపిఐ నారాయణ. జూనియర్ ఎన్టీఆర్ కి అమిత్ షా దగ్గరికి వెళ్లాల్సిన ఖర్మ ఏంటి? అంటూ ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ తాత, తండ్రి మంచివాడు.. నీకు ఏం గతి పట్టిందని అమిత్ షా ని కలిసావు? అంటూ ఎన్టీఆర్ పై మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్.. ఓ క్రిమినల్ అయిన అమిత్ షా దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని దుయ్యబట్టారు.

మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీ ఒక స్మగ్లర్.. పనికిమాలిన పనులు చేస్తేనే తొందరగా ధనవంతులు అవుతారన్నారు. అదానీ ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు? అని ప్రశ్నించారు. గుజరాత్ వాళ్ళు దేశాన్ని దొచేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ జగన్ దగ్గరికి వెళ్లి బీజేపికి వ్యతిరేకంగా పోరాడడానికి ఒప్పించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version