హెచ్‌సీయూ భూముల వేలం అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలతో పాటు బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం బీజేపీ మహిళా మోర్చా నేతలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.
భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ.. సచివాలయం ముట్టడికి బయలుదేశారు. అప్రమత్తమైన పోలీసులు మహిళా మోర్చా నేతలను అడ్డుకున్నారు.పోలీసులు, బీజేపీ మహిళా నేతల మధ్య తోపులాట చోటు చేసుకోగా.. కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డిని నెక్లెస్ రోడ్డు వద్ద అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.