Breaking : బీఎల్‌ సంతోష్‌, జగ్గుస్వామి స్టే పొడిగించిన హైకోర్ట్‌

-

ఎమ్మెల్యేలకు ఎర కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మరోసారి ఈ కేసుపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అయితే.. ఈ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని నిందితులతో పాటు బీజేపీ వేసిన పిటిషన్లపై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో బీజేపీ నేతల పేర్లు చెప్పాలని సిట్ అధికారులు వేధిస్తున్నారని శ్రీనివాస్ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. బండి సంజయ్ పేరు చెబితే నిమిషాల్లో విచారణ ముగిస్తామని సిట్ అధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు.

సిట్​పై నమ్మకం లేదని సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని శ్రీనివాస్ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. ఈ కేసులో ప్రతిపాద నిందితులుగా ఉన్న బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు సిట్ అధికారులు జారీ చేసిన 41ఏ నోటీసులపై ఉన్న స్టేను 22వ తేదీ వరకు న్యాయస్థానం పొడిగించింది. 41ఏ నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేయడంతో హైకోర్టు వాటిపై స్టే విధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version