BIG BREAKING : టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలుశిక్ష, జరిమానా విధించిన ఏపీ హైకోర్టు

-

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి కోర్టు ధిక్కరణ కేసులో నెలరోజులు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించింది ఏపీ హైకోర్టు. ధర్మారెడ్డికి కోర్టు ధిక్కరణ కేసులో నెలరోజులు జైలు శిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ ఏపీ హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది. ముగ్గురు ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. గతంలో కోర్టును టీటీడీ ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులు ఆశ్రయించారు. దీంతో.. విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. ముగ్గురు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.

TTD to hold Brahmotsavams from September 27, says EO Dharma Reddy

అయితే.. కోర్టు ఆదేశాలు అమలుచేయలేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు తాత్కాలిక ఉద్యోగులు. దీంతో.. ఉద్యోగుల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌పై విచారణ జరిపి టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలుశిక్ష, జరిమానా విధించింది ఏపీ హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version