బ్లాక్ పాంథర్ v/s చిరుతపులి.. గెలుపెవరిదో..?

-

బ్లాక్ పాంథర్, చిరుత పులిని చూస్తే ఒకింత ఆనందం వేస్తుంది అందరికీ. సాధారణంగా చిరుత, బ్లాక్ పాంథర్‌ను చూసే ఉంటాం. ఈ మధ్యకాలంలో ఈ జంతువులు జనవాసాల్లో తిరుగుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. అయితే బ్లాక్ పాంథర్‌, చిరుతపులిని ఒకే సారి చూసి ఉండం. ఈ రెండు జంతువులకు వైరం ఎక్కువే. కనిపించిన ప్రతిసారి యుద్ధానికి సై అంటూ ముందుకు దూకుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేఖని తన ట్విట్టర్ అకౌంట్‌లో చిరుతపులి, బ్లాక్ పాంథర్‌ యుద్ధం చేస్తున్న వీడియోను పోస్టు చేశారు.

 

బ్లాక్ పాంథర్-చిరుత పులి

 

కర్ణాటకలోని కబినీ వైల్డ్‌లైఫ్ శాంక్చురీకి వెళ్లిన ఆయనకు ఈ దృశ్యం కనిపించింది. దీంతో నందన్ నీలేఖని వెంటనే వీడియోను చిత్రీకరించారు. ఈ తర్వాత తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసినట్లయితే ఓ చెట్టుపై మొదటి నుంచి చిరుత పులి సేద తీరుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి బ్లాక్ పాంథర్‌ కూడా చేరుకుంటుంది. వేరే ఏ చెట్టు దొరకనట్లుగా బ్లాక్ ఫాంథర్ కూడా ఆ చెట్టే ఎక్కాలని డిసైడ్ అయ్యిందేమో.. చెట్టు ఎక్కుతుండగా చిరుత పులి గ్రహించింది. ‘‘నీకూ వేరే చెట్టు దొరకలేదా.. దిగుతావా.. రావాలా.’’ అని గుర్రుమంది. దీంతో బ్లాక్ పాంథర్‌ చిరుత పులితో గొడవ పడేందుకు రెడీ అయి పైకి ఎక్కసాగింది. కానీ కొంచెం పైకి ఎక్కగానే చిరుత ఓ రేంజ్‌లో చూపు చూసింది. దాంతో ఇంకేం గొడవ పడతామని అనుకుందో ఏమో.. మెల్లిగా జారుకోవడమే మంచిదని బ్లాక్ పాంథర్ అనుకుని వెనక్కి తగ్గింది.

 

 

54 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో నెటిజన్లను తెగ అలరిస్తోంది. వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ గంభీరంగా వెళ్లిన బ్లాక్ పాంథర్.. పిల్లిలా వెనక్కి తిరిగిందంటూ.. కామెంట్లు పెడుతున్నారు. రెండు పులులను ఒకే సారి చూడటం చాలా ఆశ్చర్యంతోపాటు ఆనందంగా ఉందంటున్నారు. అయితే ఈ ఘటన మార్చి 6వ తేదీన జరిగిందని.. విజయ్ ప్రభు అనే వ్యక్తి వీడియో తీసినట్లు నందన్ నీలేఖని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version