టీడీపీ ఎమ్మెల్యేకి ఒంగోలు ఎంపీ సీటు ఆఫర్…?

-

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కొన్ని కొన్ని సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటున్నది. ప్రధానంగా పార్టీలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా సమన్వయంతో పని చేయకపోవడంతో చంద్రబాబు నాయుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాల్సిన సమయంలో కొంతమంది నేతలకు సహకరించడం లేదనే ఆవేదన చంద్రబాబు నాయుడు లో ఎక్కువగా వ్యక్తమవుతుంది.

ఎమ్మెల్యేలు ముగ్గురు కూడా దూరంగా ఉండటంతో చంద్రబాబుకు ఏం చేయాలో అర్థం కావడంలేదు. అయితే ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళడానికి ఒక ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఒంగోలు మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే విధంగా అడుగులు వేస్తోంది. అయితే అనుకున్న విధంగా అక్కడ పరిస్థితులు కనపడటం లేదు. పార్టీలో ఉన్న వర్గ విభేదాలతో ఒక కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తో చర్చలు జరుపుతున్నారు.

ఆయనకు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వ్యక్తిగతంగా హామీ ఇచ్చారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు ఖరారు చేస్తామని ఒంగోలు నుంచి మీరు ఎంపీ సీటు తీసుకోవచ్చునని బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా హామీ ఇచ్చారట. ముఖ్యమంత్రి జగన్ నుంచి కూడా హామీ రావడంతో సదరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు పూర్తిగా పార్టీకి దూరంగా ఉన్నారని రాజకీయవర్గాల సమాచారం. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇప్పుడు సదరు ఎమ్మెల్యే విషయంలో కాస్త సీరియస్ గా ఉన్నారట. చంద్రబాబు నాయుడుతో కూడా ఇదే విషయాన్ని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version