కాశ్మీర్: వావ్…. మంచు పై పడవ ప్రయాణం..!

-

మన భారత దేశం లో చూడ దగ్గ ప్రదేశాలలో కశ్మీర్‌ ఒకటి. వివిధ ప్రాంతాల నుండి దేశాల నుండి అనేక మంది కశ్మీర్‌ అందాలని చూడడానికి వస్తూ ఉంటారు. కాశ్మీరును “భూతల స్వర్గం” అని అంటారు. ఇది నిజంగా అక్కడకి వచ్చే వారని యిట్టె ఆకట్టేసుకుంటుంది. రమణీయమైన ప్రకృతి తో ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ ప్రదేశం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే… 17వ శతాబ్దం లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ దాల్ సరస్సు పైన పడవటింట్లోంచి చూస్తూ అక్కడి సౌందర్యానికి ముగ్ధుడై భూమి మీద స్వర్గం ఎక్కడైనా ఉంటే అది ఇక్కడే, ఇక్కడే అన్నాడు.

అంత గొప్పది ఈ ప్రాంతం. చుట్టూ మంచుతో కప్పిన కొండలు.. మెరిసే సూర్య కిరణాలు…. వీటిని కనుక చూస్తే కళ్ళు తిప్పుకోలేరు. ముఘల్‌ఉద్యానవనాలు, శ్రీనగర్, గుల్‌మార్గ్, పహల్‌గావ్ వంటి ప్రదేశాలని తప్పక చూడాల్సిందే. ఎప్పుడూ చల్లగా ఉండే కశ్మీరం లో చలికాలంలో అయితే మాత్రం ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోయి ఎక్కడ చూసినా మంచు గుట్టలే కనిపిస్తాయి.

అయితే కొన్ని రోజుల నుండి చలి మరీ ఎక్కువగా ఉండడం తో కాశ్మీర్ లో విపరీతంగా మంచు కురుస్తున్నది. దీని మూలం గానే సుప్రసిద్ధ దాల్‌ సరస్సు పాక్షికంగా గడ్డకట్టుకుపోయింది. ఇలా కావడం చేత పడవలను మరో ఒడ్డుకు తీసుకెళ్లడానికి వాటిని నడిపేవాళ్లు ఇలా శ్రమిస్తున్నారు. కానీ పర్యాటకులు మాత్రం దిల్ కుష్ అయిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version