ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్ధికంగా కష్టాలు ఉన్నా సరే….చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ఏపీ సిఎం జగన్..ప్రజలకు పథకాలు అందిస్తున్నారు. తాను మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. కోవిడ్ సమయంలో కూడా మాట తప్పలేదు. తాజాగా కూడా డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాల్లో వైఎస్సార్ ఆసరా పథకం కింద డబ్బులు వేస్తున్నారు.
పాదయాత్రలో ప్రతి గ్రూపుకు రూ.10 లక్షలు ఇస్తానని జగన్ హామీ ఇచ్చి, ఇప్పుడు 2019 నాటికి ఎంత బాకీ ఉంటే అంత రద్దు చేస్తామని మహిళలను మోసం చేస్తున్నారని బోండా ఉమా అంటున్నారు. అదే చంద్రబాబు ఉంటే ప్రతి గ్రూపుకు 5 లక్షలు వచ్చేవని అన్నారు. అయితే జగన్ పాదయాత్రలో డ్వాక్రా సంఘాల రుణాలని మాఫీ చేస్తామని అన్నారు…అంటే తాను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అవుతుంది. జగన్ అలాగే చేస్తున్నారు. కానీ దీనిపై కూడా టిడిపి విమర్శలు చేస్తుంది. జగన్ పెట్టిన ప్రతి పథకం బోగస్ అని చెప్పి మాట్లాడుతుంది.
అయితే జగన్…కనీసం మాట తప్పకుండా పథకాలు అమలు చేస్తున్నారు. కానీ గతంలో చంద్రబాబు మాట ఇచ్చి మరీ..అధికారంలోకి వచ్చాక దారుణంగా మాట తప్పారు. రైతు రుణమాఫీ చేసేస్తామని ముందు చెప్పారు…అధికారంలోకి వచ్చాక దానికి రూల్స్ పెట్టి, రుణమాఫీని గాల్లో కలిపేశారు. ఇక డ్వాక్రా రుణమాఫీ కూడా చేస్తానని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక దాని ఊసే తీయలేదు. ఎన్నికల ముందు మాత్రం రూ.10 వేలు వేసి చేతులు దులుపుకున్నారు. బాబు బోగస్ పథకాలు అమలు చేస్తున్నారనే ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా సరే టిడిపి నేతలు జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. బోగస్ అనే మాట బాబుకే వర్తిస్తుందని చెప్పొచ్చు.