Bollywood : అదనపు సన్నివేశాలతో ఓటిటీ లోకి రాబోతున్న రణబీర్ కపూర్ లేటెస్ట్ మూవీ….

-

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన తాజా చిత్రం యానిమల్. డిసెంబర్ ఒకటవ తేదీన విడుదలైన యానిమల్ చిత్రం 850 కోట్ల భారీ వసూళ్లను సాధించి…. ప్రస్తుతం 1000కోట్ల వసూళ్ళ వైపు పరిగెడుతుంది. తాజాగా సలార్, డంకి చిత్రాలు రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకులు ఇంకా యానిమల్ చిత్రాన్ని ఆదరిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే … ఈ సినిమా ఓటిటి కి సంబంధించిన వార్త ఒకటి వైరల్ గా మారుతుంది. థియేటర్స్ లో మూడు గంటల 21 నిమిషాలకు పైగా నిడివితో విడుదలైన ఈ చిత్రం ఓటిటీ వెర్షన్ ఇంకా ఎక్కువ నిడివి తో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంటే ఏడు నుంచి ఎనిమిది నిమిషాల నిడివిగల వీడియోస్ సన్నివేశాలను జత చేయనున్నారు. నిజానికి ఈ సన్నివేశాలను థియేటర్ వర్షన్ లో చూపించాలని మొదటగా భావించినప్పటికి సినిమా యొక్క నిడివి అధికంగా ఉండడం వలన వాటిని తొలగించాల్సి వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. జనవరిలో ఈ సినిమా ఓటీటీ లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version