పవన్ చిత్రంలో బాలీవుడ్ నటుడు.. నిజమేనా..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల అప్డేట్ గురించి ప్రస్తుతం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు పవన్. ఇక చివరిగా భీమ్లా నాయక్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమైంది. కానీ కరోనా కారణం చేత షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ వస్తోంది. ఆటు తర్వాత పవన్ రాజకీయాల వైపు బిజీగా ఉండడం చేత ఈ సినిమా ఆలస్యానికి కారణమని చెప్పవచ్చు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీలైనంత త్వరగా తన సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. మొహలాయిల కాలంనాటి కథ అంశంతో తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం లో పవన్ కళ్యాణ్ ఒక బందిపోటుగా కనిపించబోతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తూ ఉన్నది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కర్ర సామను నేర్చుకోవడం జరిగింది.

ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో బాబి డియోల్ ను ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ నటుడు ఇటీవల నటించిన ఆశ్రమం అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. మరి నటుడు బాబి డియోల్ పైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news