మెక్సికో: కీటకాల గుడ్లను నైవేద్యంగా తినే ఆచారం.. కాస్ట్లీ ప్రసాదం

-

ఈ ప్రపంచంలో మనుషులు ఆకృతి ఒకేలా ఉన్నా..వారి పద్ధుతులు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు చాలా భిన్నంగా ఉంటాయి.. ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ జనసంద్రంలో ఏ ఇద్దరి వ్యక్తిత్వం ఒకేలా ఉండదు. ఇంచుమించు పోలి ఉండొచ్చు కానీ..ప్రతిబింబం అయితే కాలేరు. ఇక ఆహారాల విషయానికి వస్తే.. కొంతమంది తినే ఆహారం మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చైనా వాళ్లు తినేవి చూస్తే మనకు కచ్చితంగా నోరెళ్లబెడతాం.. వాళ్లు ఎగిరేవి, పాకేవి, ఈదేవి అని తేడాలేకుండా లాగించేస్తుంటారు. మెక్సికో నగరంలో కీటకాల గుడ్లను దేవతల ఆహారంగా భావించి తింటారట.. ఆశ్చర్యంగా ఉంది కదూ..!
కొన్ని నివేదికల ప్రకారం…మెక్సికో సిటీకి చాలా దూరంలో ఉన్న లేక్ టెక్స్కోకో చెరువులో వాటర్ ఫ్లై (దోమ) కూడా కనిపిస్తుంది. ఈ ఫ్లై గుడ్లను అహుటిల్ అంటారు. అహుట్లే అంటే ఆనందానికి బీజం అని అర్థం. ఇది పరిమాణంలో బఠానీ కంటే చిన్నదిగా ఉంటుంది.. దీనిని మెక్సికో నగర ప్రజలు వినియోగిస్తారు. 14-15వ శతాబ్దంలో మెక్సికోలోని అజ్టెక్ సామ్రాజ్యం నుంచి ప్రజలు దీనిని వినియోగిస్తున్నారు.

గుడ్లు ఎలా సేకరిస్తారు..

మత్స్యకారులు నీటిలో దోమలు పెట్టే గుడ్లను సేకరిస్తారు. అయితే దీని కోసం..ముందుగా నీటి ఉపరితలం క్రింద ఒక పెద్ద వల కట్టి ఉంచుతారు… దానిపై దోమలు లేదా ఈగలు గుడ్లు పెడతాయి. దీనిని మత్స్యకారులు, ఆయా ప్రాంత రైతులు సేకరించి ఎండలో ఆరబెడతారు. 14వ శతాబ్దం నుంచే ప్రజలు కీటకాల గుడ్లను తింటున్నారని సమాచారం. కానీ ఈ జనరేషన్‌ వాళ్లు వీటిని తినడం లేదు. ఎక్కడో అరుదుగా జరుగుతుంది. అందుకే మెక్సికో నగరంలోని అనేక రెస్టారెంట్లు డిష్‌ను అందించటం లేదు.. అలాగని ఈ డిష్ అంత చవకైనది కాదు. ధరలో చాలా ఖరీదైనది. 2019లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, ఒక చిన్న జార్ గుడ్డు ధర రూ. 1600 వరకు ఉంటుందిట..
అలా శతాబ్ధాల నాటి ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే ఈ జనరేషన్‌ వాళ్లు తినడం లేదు కాబట్టి..రానున్న రోజుల్లో ఈ సంప్రదాయం కనుమరుగయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news