మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు : తెలుగు రాష్ట్రాలలో సెంచరీ దాటిన డీజిల్ రేట్స్ !

-

మనదేశంలో గత కొంత కాలం నుంచి.. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ ధరలు పెరగడమే తప్ప ఏనాడు తగ్గిన దాఖలాలు లేవు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలతో… సామాన్యుడి జీవితం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇక తాజాగా మరోసారి దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు మరియు డీజిల్ పై 35 పైసలు పెంచాయి సంస్థలు.

దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.24 కు చేరగా డీజిల్ ధర రూ. 91.77 కు పెరిగింది. అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107. 40 కు చేరగా డీజిల్ ధర రూ. 100. 13 కు పెరిగింది.

ముంబై లో రూ. 109 . 25 , కు చేరగా డీజిల్ ధర రూ. 99. 55 కు పెరిగింది. కోల్ కతాలో రూ . 103. 94 కు చేరగా డీజిల్ ధర రూ. 94. 88 కు పెరిగింది. చెన్నైలో రూ . 100. 75 కు చేరగా డీజిల్ ధర రూ. 95. 26 కు పెరిగింది.ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109. 60 కు చేరగా డీజిల్ ధర రూ. 101. 74 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version