ఈ దెబ్బతో అనుష్క రేంజ్ అర్థమైపోయిందిగా..!

-

అనుష్క శెట్టి, అరుంధతి సినిమాతో తనకంటూ సొంతంగా ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న నటి. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నటి. సూపర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత అరుంధతి సినిమాతో స్థిరపడిపోయింది. ప్రస్తుతం అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 15సంవత్సరాలు దాటిపోయింది. హీరోయిన్ గా 15ఏళ్ళు కొనసాగడమంటే మాటలు కాదు. ఇన్ని ఏళ్ళుగా స్టార్ డమ్ తో హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుందంటే దానికి కారణం ఆమె పర్ ఫార్మెన్స్ అని చెప్పక తప్పదు.

బాహుబలి తర్వాత అన్నీ లేడీ ఓరియంటెడ్ చిత్రాలే చేస్తున్న అనుష్క, పిల్లజమీందార్ దర్శకుడు అశోక్ దర్శకత్వంలో భాగమతి చిత్రంలో నటించింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఐతే ఇదే సినిమాని హిందీలో భూమి పడ్నేకర్ హీరోయిన్ గా దుర్గామతి పేరుతో రీమేక్ చేసారు. తెలుగులో మంచి కలెక్షన్లు అందుకున్న ఈ చిత్రం హిందీలో రీమేక్ అవుతుందని తెలిసినప్పటి నుండి అనుష్క అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూసారు. కానీ ఆ ఆసక్తి అంతా సినిమా రిలీజ్ అయ్యాక నీరుగారిపోయింది.

దుర్గామతి సినిమాకి ప్రేక్షకుల నుండి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. సోషల్ మీడియాలో భూమి ఫెడ్నేకర్ పై ట్రోల్స్ చేస్తున్నారు. సేమ్ కథ, సేమ్ డైరెక్షన్ తెలుగులో సూపర్ హిట్ అయ్యి, హిందీలో డిజాస్టర్ తెచ్చుకోవడానికి కారణం, లీడ్ రోల్ పోషించిన భూమి ఫెడ్నేకర్ అనే అంటున్నారు. నటన పరంగా ఎవరికి ఉండాల్సింది వారికి ఉంటుంది గానీ, దర్శకుడిగా అశోక్ కి ఎదురుదెబ్బ తగిలినట్టే లెక్క.

Read more RELATED
Recommended to you

Latest news