హీరోయిన్ ఆర్తి చాబ్రియ హిందీ సినిమాలలో నటించి అందరిని మెప్పించింది. తెలుగులో ఒకరికొకరు ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి గోపి గోడ మీద పిల్లి వంటి సినిమాల్లో నటించింది. కానీ ఇవేమీ పెద్దగా హిట్ అవ్వలేదు. అందుకని బాలీవుడ్ లోనే ఉండిపోయింది. 2019లో ఆస్ట్రేలియా కి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది అక్కడే సెటిల్ అయింది తర్వాత పూర్తిగా కుటుంబ బాధ్యతలు తీసుకుని సినిమాలకు దూరమైపోయింది.
ఇప్పుడు ఈమె 41 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అని ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేసింది. ఆర్తి తన బేబీ బంప్ వీడియో ని పోస్ట్ చేస్తూ, నా జీవితంలో అత్యంత అందమైన నిజజీవిత పాత్రను సృష్టించడం పెంపొందించడం పరిణామం చెందడం మీద దృష్టి సారించి ఉత్తమ నెలల్ని నేను ఆస్వాదిస్తున్నానని ఆమె రాసుకు వచ్చింది. ఆర్తి చాలా రోజులకి కనిపించడంతో అందులోనూ బేబీ బంప్ తో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసుకున్నా వీడియో నెట్టింట వైరల్ గా మారింది.