మెగా స్టార్ గాడ్ ఫాద‌ర్ లో బాలీవుడ్ స్టార్ హీరో ?

-

మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా వ‌స్తున్న సినిమా గాడ్ ఫాద‌ర్. ఈ సినిమా కు సంబంధించి ఒక క్రెజీ అప్ డేట్ సోషల్ మీడియాలో ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్ర లో క‌నిపింస్తున్నాడ‌ని టాక్. మెగా స్టార్ సినిమా అని తెలిసిన వెంట‌నే స‌ల్మాన్ ఖాన్ ఈ సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అయితే మోహ‌న్ లాల్ న‌టించిన లూసిఫ‌ర్ రీమేక్ గా వ‌స్తున్న సినిమా గాడ్ ఫాద‌ర్ అని తెలిసిందే.

అయితే లూసిఫ‌ర్ లో పృథ్వి రాజ్ న‌టించిన పాత్ర‌లో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్నాడ‌ని సమాచారం. అయితే ఈ పాత్ర చిరంజీవి కి తోడుగా ఉంటుంది. కొంత స‌మ‌యం మాత్ర‌మే ఉన్నా.. కీల‌కంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ పాత్ర తో ఒక పాట కూడా ఉంటుంది. దీంతో ఈ పాత్ర లో బాలీవుడ్ కండల వీరుడు న‌టించ‌డంతో గాడ్ ఫాద‌ర్ కు అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. కాగ ఇప్ప‌టి కే ఈ సినిమా లో చిరంజీవి తో పాటు న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ లు కూడా న‌టిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news