TTD Diary 2022 : బుకింగ్ లు షూరు ! ధ‌ర ఎంత అంటే?

-

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని ప్ర‌ముఖ దేవాస్థానం అయిన తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం ప్ర‌తి ఏడాది డైరీలును, క్యాలెండ‌ర్ల ను విడుద‌ల చేస్తుంది. అందులో భాగంగా 2022 సంవ‌త్స‌రానికి గాను డైరీలు, క్యాలెండ‌ర్లు త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నుంది. అయితే ఆ డైరీలు, క్యాలెండ‌ర్లు కావాలి అనుకునే వాళ్లు ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవ‌చ్చ‌ని టీటీడీ తెలిపింది.

ఈ రోజు నుంచి ఆన్ లైన్ ద్వారా డైరీలు, క్యాలెండ‌ర్ల బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంద‌ని తెలిపింది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని బుకింగ్ చేసుకోవచ్చు అని తెలిపింది. అలాగే వాటి ధ‌ర‌ల‌ను కూడా టీటీడీ వివ‌రించింది. పెద్ద డైరీ రూ. 150 అలాగే చిన్న డైరీ రూ. 120, క్యాలెండ‌ర్ రూ. 130 తో పాటు టేబుల్ క్యాలెండ‌ర్ రూ. 75 ఉంటుంద‌ని బోర్డు తెలిపింది. అయితే వీటి కోసం పోస్ట‌ల్ ఛార్జీ లు మ‌నమే భ‌రించాల్సి ఉంటుంది. పోస్ట‌ల్ ఛార్జీలు చెల్లించి మ‌న చిరునామా కు కావాల్సిన‌న్నీ డైరీలు, క్యాలెండ‌ర్లు ఆర్డ‌ర్ చేసు కోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version