Chiranjeevi: చిరు 154 మూవీ నుంచి క్రేజీ అప్డేట్! మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న‌ మాస్ హీరో !

-

Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వ‌త‌.. వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా షూట్ పూర్తి చేసి.. విడుద‌ల‌కు సిద్ధంగా ఉంచాడు. ఈ చిత్రం అనంత‌రం.. గాఢ్ ఫాద‌ర్ సినిమా షూటింగ్‌ను మొద‌లుపెట్టేశాడు. ఇక మ‌రోవైపు.. భోళా శంక‌ర్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు. ఏ మాత్రం త‌గ్గేదేలే అన్న‌ట్టుగా.. చిరంజీవి 154వ సినిమా కూడా ప్ర‌క‌టించారు. ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది.

ఈ సినిమాకు వాల్తేరు వీర‌య్య అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో పెట్టార‌ట‌. ఈ సినిమాలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రెగ్యూల‌ర్ డిసెంబ‌ర్ నుంచి జ‌రుగనున్న‌ది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుద‌లైన‌.. చిరు లుక్‌.. గ్యాంగ్ లీడ‌ర్ సినిమా త‌ర‌హాలో ఊర మాస్ గా ఉన్నది. ఈ పోస్ట‌ర్ తో సినిమాపై భారీ మొత్తంలో అంచ‌నాలు పెరిగిపోతున్నాయి.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఒక కీల‌క పాత్ర ఉంద‌ని, అందులో టాలీవుడ్ స్టార్ హీరో క‌నిపించ‌బోతున్నట్లు టాక్. ఆ పాత్ర కోసం.. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో చ‌ర్చించిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి. ర‌వితేజ ముందే.. మెగా స్టార్ కు పెద్ద ఫ్యాన్.. చిరుతో న‌టించే అవ‌కాశం రావ‌డంతో మ‌రో మాట లేకుండా ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

ర‌వితేజ గ‌తంలో చిరంజీవి న‌టించిన అన్న‌య్య, శంక‌ర్ దాదా జిందాబాద్ సినిమాలో న‌టించాడు. తాజాగా మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైపు ఇదే రోల్ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను సంప్ర‌దించిన‌ట్టు కూడా వార్త‌లు వినిపించాయి. మ‌రి మాస్ మహారాజా , ప‌వ‌ర్ స్టార్ లో ఎవ‌రు మెగాస్టార్ తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారో వేచి చూడాలి మ‌రి!

Read more RELATED
Recommended to you

Exit mobile version