తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో బూస్టర్ డోస్ ను అందించనుంది కేసీఆర్ సర్కార్. 60 ఏళ్ళు పైబడిన వాళ్లకు, హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రoట్ లైన్ వర్కర్లకు ఈ బూస్టర్ డోస్ ను అందించనుంది.. మొదటి, రెండో డోస్ తీసుకున్న వాక్సిన్ నే మూడో డోస్ గా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వైద్య అధికారులు పేర్కొన్నారు.
రెండో డోస్ పూర్తయిన 9 నెలలకు కరోనా బూస్టర్ డోస్ ను అందించనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే.. చార్మినార్ యునాని ఆస్పత్రిలో బూస్టర్ డోస్ ను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో.. ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
కాగా..కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో… కరోనా ఆంక్షలను ఈ నెల 20 వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.