ఉద్యమాన్ని ఇంకా విరమించ లేదు : ఏపీ ఉద్యోగులు

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఏపీ ఉద్యోగులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు సజ్జ ల రామ కృష్ణా తో మరో దఫా చర్చలు చేసింది ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి. అనంత‌రం బొప్పరాజు మాట్లాడుతూ… ఉద్యమాన్ని ఎవరిని అడిగి విరమించారని కొంత మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారని మండిప‌డ్డారు.

త‌మ ఉద్యమాన్ని ఇంకా విరమించ లేదని.. ఇది తాత్కాలిక విరామమే న‌ని ఆయ‌న పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసమే ఉద్యమమ‌ని చెప్పారు బొప్ప రాజు. ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చినందుకే తాత్కాలిక విరామం ప్రకటించామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఏ సమస్య ఉన్న వెంటనే పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎంఓలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమిస్తాం అన్నారని బొప్ప రాజు తెలిపారు.