ఏ క్షణమయినా పరిపాలనా రాజధానిని విశాఖకు !

-

రాజమండ్రిలో మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని మీద ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏ క్షణం అయినా పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామన్న ఆయన ఏపీలో మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలన్నదే సిఎం జగన్ సంకల్పమని అన్నారు. రాజధానులపై టీడీపీ కోర్టుకు వెళ్ళి అభివృద్ధిని అడ్డుకుంటుందన్న ఆయన కోర్టులో వున్న అంశాన్ని అధికమించి ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని విశాఖకు తరలిస్తామని అన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి ఉన్న అద్భుతమైన అవకాశాన్ని గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో దుర్వినియోగం చేశారని, అవినీతి , ఒక వర్గం రాజధానిగా అమరావతి ని చేయడంతో అభివృద్ధి ని 20 ఏళ్ళ  వెనక్కి తీసుకెళ్ళారని అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల చట్టం చేశారన్న అయన జడ్పీటీసీ , ఎంపీటీసీ , మిగిలిన 32 కార్పొరేషన్ ,మున్సిపల్ , సహకార ఎన్నికలు త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news