ఎన్నికలు అందరికీ అవసరమే…మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

ఇళ్ల పట్టాలను అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. స్థానిక ఎన్నికల పేరుతో సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనించాలని మంత్రి బొత్స కోరారు. గుంటూరు..కొర్నేపాడు లో ఇళ్ళ పట్టాలు పంపిణీలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ పవిత్రమైన పనులు చేస్తుంటే దుర్మార్గమైన ఆలోచనలతో దుష్ట శక్తులు  అడ్డం పడుతున్నాయని అన్నారు.

కుల మతాల పేరుతో మనలో మనం  కొట్లాడుకునేలా  నీచమైన రాజకీయాలు చేస్తున్నారని, నూతన సంవత్సర,సంక్రాంతి కానుకగా ముఖ్య మంత్రి ఇళ్ళ పట్టాలను ఇస్తున్నారని , ఎవరూ ఇళ్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. అధికారం కోల్పోయిన చంద్రబాబు ఆయన తాబేదార్లు కుతంత్రంతో కోర్టులకు వెళ్ళారని, అయినా ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. కొంత మంది దుర్బుద్ధి తో పట్టాల పంపిణీ ఆలస్యం అయ్యేలా కుట్రలు చేస్తున్నారుని సంక్షేమం అందకుండా  అడ్డుకోవాలని టిడిపి ఇతర వ్యక్తులు చేస్తున్న కార్యక్యమాల పై ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. ఎన్నికలు అందరికీ అవసరమే.. కాదనము, రాష్ట్రంలో పరిస్థితుల పై ఆలోచన చేయాలని అన్నారు.