భారత జట్టు బౌలర్ అనిల్ కుంబ్లే అంతర్జాతీయ టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 1999లో పాకిస్తాన్‌పై ఈ జంబో ఈ ఫీట్ సాధించాడు. అయితే తొలిసారి ఈ ఘనత అందుకున్నది మాత్రం ఇంగ్లండ్ మాజీ బౌలర్ జిమ్ లేకర్. 1956 లో లేకర్ టెస్ట్ ఇన్నింగ్‌లో 10 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మొత్తం పది వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా ఇంగ్లీష్ పేసర్ జిమ్ లేకర్ 63 సంవత్సరాల కిత్రం ఈ ఘనత సాధించాడు.
అయితే ఈ ఇద్దరి తర్వాత అంతర్జాతీయ టెస్టుల్లో ఇప్పటి వరకు ఎవరూ ఈ ఘనతను అందుకోలేదు. డొమెస్టిక్ క్రికెట్‌లో మాత్రం రెక్స్ రాజ్‌సింగ్(మణిపూర్), దేబాషిష్ మొహాంతీలు ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఇక జిమ్ లేకర్ 1946 నుంచి 1959లో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. తన 46 టెస్ట్ మ్యాచ్‌ల కెరీర్‌లో, అతను 21.24 సగటుతో 193 వికెట్లు పడగొట్టాడు.
మరియు 19 వికెట్లు పడగొట్టిన నాటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 16.4 ఓవర్లు బౌలింగ్ చేసి 37 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్ 51.2 ఓవర్లు వేసి 53 పరుగులతో 10 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23 ఓవర్లు మెయిడిన్ కావడం విశేషం. లేకర్ 450 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో కూడా పాల్గొని 1944 వికెట్లు పడగొట్టాడు.
#OnThisDay in 1956, Jim Laker became the first bowler to pick up 1️⃣ 0️⃣ wickets in a Test innings ?
He picked up a total of 1️⃣ 9️⃣ wickets in that Test against Australia ?Do you remember which other bowler has picked up 10 wickets in an innings? pic.twitter.com/bQTfSm2tmD
— ICC (@ICC) July 31, 2019
Anil Kumble