అసోం రాష్ట్రంలో వరదలు బీభత్సవం సృష్టిస్తున్నాయి. గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. బ్రహ్మపుత్రా నదిలో నీటి ఉదృత పెరగడంతో ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళింది. దీని వలన చాల గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. వరదల ఉద్ధృతి మొత్తం 30 జిల్లాల్లోని 54 లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకూ 107 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాల్లో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 2,700 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. బ్రహ్మపుత్రా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించడంతో అనేక వందలాది ఇళ్లు నీట మునిగాయి. వరదల ధాటికి ఇళ్లు, వంతెనలు నేలమట్టమయ్యాయి. దాదాపు 50వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలియజేశారు.ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు దాదాపు లక్ష క్వింటాళ్ల బియ్యం, 19,397 క్వింటాళ్ల కందిపప్పు, 173,006 లీటర్ల వంట నూనె అందజేసినట్టు అధికారులు తెలియజేశారు.