ఈనెల 31న బ్రాహ్మణ పరిషత్ భవనం ప్రారంభం

-

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ఈ నెల 31న ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దేశంలో మరెక్కడా నిర్మించని విధంగా దేవాలయాల నిర్మాణాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కేసీఆర్ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. పేదలయిన బ్రాహ్మణ వర్గాల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తోందని తెలిపారు. పూజారి వృత్తినే నమ్ముకున్న పేద బ్రాహ్మణ పిల్లలకు చక్కటి చదువు అందుతోందని పేర్కొన్నారు.

పేద బ్రాహ్మణ వర్గానికి తెలంగాణ రాష్ట్రం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు.. దేశంలోని మరే రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. ఈనెల 31 నాడు జరగబోయే పరిషత్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా చండీ యాగం సుదర్శన యగాలను నిర్వహించాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవానికి అన్ని రాష్ట్రాల నుంచి ప్రముఖ పుణ్య క్షేత్రాల నుంచి అర్చకులను, ప్రముఖ హిందూ మత పెద్దలను, దేశవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సీఎం కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version