బ్రెడ్‌ జామ్‌ కాంబినేషన్‌ అస్సలు మంచిది కాదట.. ఈ సమస్యలన్నీ…

-

చాలమందికి డైనింగ్‌ టేబుల్ మీద ఉన్న అన్ని ఐటమ్స్‌ కలిపేసి తినే అలావాటు ఉంటుంది. అలా తింటే అదొక టేస్ట్‌ అని వాళ్లు అనుకుంటారు. కానీ మీకు ఐడియా ఉండే ఉంటుంది.. కొన్ని ఆహారపదార్థాలను వేరే వాటితో కలిపి తినకూడదు అని..అలా తినకూడదు అనే కాంబినేషన్‌ చెప్పమంటే అందరూ టక్కున చెప్పేది.. చేపలు విత్‌ పెరుగు, పొట్లకాయ విత్‌ కోడిగుడ్డు అంటారు.. చేపలతో పెరుగే కాదు.. పాలు, మజ్జిగ, తేనె, మినపపప్పు, మొలకెత్తిన ధాన్యాలు కూడా తినకూడదు. ఇలా తింటే ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మరికొన్ని ఆహార కలయికలు ఉన్నాయి. అవి జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తాయి, కడుపు pHను దెబ్బతీస్తాయి. కానీ చాలా మంది ఇది తెలియక అలాగే తింటున్నారు. ఇన్నాళ్లు చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్‌జామ్‌ తింటూ వచ్చారు.. ఇది అస్సలు తినగలిగిన కాంబినేష్‌నే కాదు.. తెలుసా.?
STOP giving your kids BREAD JAM | The Times of India

పాలకూరతో కాఫీ, టీలు

చాలా మంది ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్‌లో పాలకూర చపాతీలు లేదా పాలక్ పరాఠా తిని కాఫీ, టీలు తాగుతారు.. కానీ ఇది మంచి కాంబినేషన్ కాదు… ఎందుకంటే పాలకూరలో ఐరన్ అధికంగా ఉండే ఆహారం. టీ- కాఫీలలోని పాలీఫెనాల్స్, టానిన్లు, కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్స్ ఐరన్ శోషణను తగ్గిస్తుంది. దీని వల్ల ఆహారం తీసుకున్నా ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా ఈ కలయిక గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది.

పాలతో సిట్రస్ పండ్లు..

పాలు తాగటం, పండ్లు తీసుకోవడం మంచిదే.. రోగనిరోధక శక్తికి సిట్రస్ పండ్లు చాలా మంచివి. కానీ ఈ పాలు- పండ్ల కలయిక మాత్రం మంచిది కాదు. ఈ కాంబినేషన్ మీ పొట్టను కలవరపెడుతుంది. ఇది అజీర్ణానికి కారణమవుతుంది.

బ్రెడ్ – జామ్

బ్రెడ్- జామ్ అనేది పాపులర్ బ్రేక్ ఫాస్ట్ కాంబినేషన్. మీకు ఇది వినగానే షాకింగ్‌గా అనిపించి ఉండొచ్చు.. తినడానికి ఏమి లేనపుడు లేదా సమయం లేనపుడు. బ్రెడ్ ముక్కలపై జామ్ రాసుకొని బ్రేక్ ఫాస్ట్ చేసేస్తారు. కానీ, అది శరీరానికి హానికరం. ఎందుకంటే బ్రెడ్‌లో ప్రోటీన్, కొవ్వు తక్కువగా ఉంటుంది. సాధారణ పిండి పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆకలి తీరినట్లు అనిపిస్తుంది. జామ్‌లో చక్కెర అధికంగా ఉంటుంది, ఇది వెంటనే శక్తిని ఇస్తుంది. అంటే ఈ రెండూ తింటే కొంత కాలం వరకు ఆకలి కోరిక తీరినట్లే. కానీ ఒక గంట తర్వాత తీవ్రంగా ఆకలిగా అనిపిస్తుంది. అలాగే, రక్తంలో చక్కెరను పెంచుతుంది, జీవక్రియను నెమ్మదిస్తుంది, కడుపు సమస్యలను కలిగిస్తుంది. ఇంత జరుగుతుంది కడుపులో..! ఇక తినాలా వద్దా మీరే ఆలోచించుకోండి.!

పిజ్జాతో కూల్ డ్రింక్స్..

పిజ్జాతో తింటూ.. సోడా, కోక్ లేదా శీతల పానీయాలు తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. అప్పుడే మనం ఫుడ్‌ను ఎంజాయ్‌ చేస్తాం..కానీ పిజ్జాతో పాటు ఏ రకమైన కూల్‌డ్రింక్స్‌ తాగడం మంచిది కాదు. పిజ్జాలో సంతృప్త కొవ్వు ఉంటుంది. సోడా ఉప్పుతో నిండి ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను దెబ్బతీస్తుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా, మన జీర్ణవ్యవస్థ పిజ్జాను జీర్ణం చేయడానికి కష్టపడుతుంది. ఇది ఉబ్బరం ఇతర కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version