తిరుమల భక్తులకు షాక్.. అక్టోబ‌రు 24, 25, నవంబరు 8న బ్రేక్ ద‌ర్శనాలు ర‌ద్దు

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ షాక్ తగిలింది. మూడు రోజుల పాటు బ్రేక్ ద‌ర్శనాలు ర‌ద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి. అక్టోబ‌రు 24, 25, నవంబరు 8న తిరుమల శ్రీ వారి బ్రేక్ ద‌ర్శనాలు ర‌ద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్రగ్రహ‌ణం కార‌ణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్ ద‌ర్శనాలను రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న 73,420 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 27,621 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.28కోట్లుగా నమోదు అయింది. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version