ఈ మధ్యకాలంలో మీరు బాగా పరిశీలిస్తే విదేశాలలో నివసిస్తున్న భారతీయులు అప్పుడప్పుడు ఉద్దేశపూర్వకంగా కాకున్నా హత్యలు చేయబడుతున్నారు. ఇక అదే విధంగా తాజాగా కెనడాలో భారత్ కు చెందిన గ్యాంగ్ స్టర్ ను దారుణంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అమర్ ప్రీత్ సింగ్ అనే ఒక గ్యాంగ్ స్టర్ వ్యాపారాలు చేసుకుంటూ రౌడీయిజాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా తాజాగా కెనడా పోలీసులు ఇటీవల ప్రకటించిన 11 మంది మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ ల లిస్ట్ లో అమర్ ప్రీత్ ఒకడుగా ఉన్నారు. కాగా ఇతనికి వ్యాపారాలలోనూ శత్రువులు ఉన్నారు, అమర్ ఒక పెళ్లి వేడుకలో పాల్గొనగా హఠాత్తుగా శత్రుమూక చేసిన చేసిన దాడిలో అమర్ ప్రీత్ మరణించారు.