BREAKING: ఆస్ట్రేలియాకు బ్యాడ్ న్యూస్, మిస్టర్ పర్ఫెక్ట్ స్మిత్ కు అస్వస్థత !

-

రేపు ఆస్ట్రేలియా మరియు ఆఫ్గనిస్తాన్ జట్లు ముంబై వేదికగా కీలక మ్యాచ్ లో తలపడనున్నాయి. రెండు జట్లకు కూడా చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పాలి. రేపు జరగనున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా కనుక గెలిస్తే సెమీస్ కు చేరిన మూడవ జట్టుగా అవతరిస్తుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఆస్ట్రేలియా ఆడనున్న చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలవాల్సి ఉంటుంది. చాలా ముఖ్యమైన మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా కు గట్టి షాక్ తగిలింది. నిన్న ముంబై లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియా కీలక ప్లేయర్ స్మిత్ కు తలతిరిగినట్లుగా అనిపించిందట. బ్యాటింగ్ ఆడుతూ నెట్స్ లోనే పడిపోయాడట. ఇక అప్పటి నుండి ప్రాక్టీస్ కు మళ్ళీ రాలేదని తెలుస్తోంది.

ఇక స్మిత్ అస్వస్ధ పట్ల ఇంకా ఆస్ట్రేలియా క్రికెట్ నుండి అప్డేట్ ఏమీ లేకపోవడంతో రేపటి మ్యాచ్ లో ఆడుతాడా లేదా అన్నది ఇంకా కంఫర్మ్ కాలేదు. సెమీస్ కు చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news