ఆస్ట్రేలియా ముందు సౌత్ ఆఫ్రికా ఉంచిన 312 పరుగులను చేధించే క్రమంలో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ మరియు మిచెల్ మార్ష్ లు మొదటి బంతి నుండి పిచ్ నుండి బ్యాట్స్మన్ కు తగినంత సహకారం లేకపోవడంతో నిదానంగా ఆడుతూ వచ్చారు. కానీ సహనం కోల్పోయిన మిచెల్ మార్ష్ మార్కో యన్సేన్ బౌలింగ్ లో భారీ షాట్ ను ఆడబోయి బావుమా కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ సమయంలో మార్ష్ స్కోర్ కేవలం 7 పరుగులు కావడం చాలా బాధాకరం. మార్ష్ ఎక్కువ సేపు క్రీజులో ఉంటే ఏమి జరుగుతుందో బాగా తెలిసిన సౌత్ ఆఫ్రికా ఒక పథకం ప్రకారం అతన్ని ఊరించే బంతిని వేసి అవుట్ చేసి సక్సెస్ అయ్యారు. తద్వారా ఆస్ట్రేలియా టాల్ చేస్ లో ఇంపార్టెంట్ వికెట్ ను కోల్పోయింది.
మరో వైపు వార్నర్ నెమ్మదిగా ఆడే క్రమంలో ఎంగిడి బౌలింగ్ లో డస్సెన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం జట్టు స్కోర్ 2 వికెట్లకు 27 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ ను గెలవాలంటే ఏదైనా అద్భుతమే జరగాలి.