BREAKING :రైతు రుణమాఫీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

-

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023 డిసెంబర్ 9కు ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది.

కాగా, పంటల రుణమాఫీకి 40 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి అని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కాగా, ఆగస్ట్ 15వ తేదీ లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో.. జూలై చివరి వారం నుండి మాఫీ ప్రాసెస్ మొదలుపెట్టి.. ఆగస్ట్ 15 నాటికి పూర్తిచేసేలా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసినట్లు సమాచారం. ఇందుకోసం రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నిధులను కూడా సమీకరిస్తోన్నట్లు సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news