డిఎస్సీ దరఖాస్తుల స్వీకరణ జూన్ 20 వ తేదీన ముగిసింది. మొత్తంగా 2 లక్షల 80 వేల దరఖాస్తులొచ్చాయి అని విద్యాశాఖాధికారులు ప్రకటించారు.గతంలో వచ్చిన దరఖాస్తులకు అదనంగా మరో లక్షమంది కొత్తగా దరఖాస్తు చేసేకున్నారని వెల్లడించారు. జులై 17 నుంచి 31 వరకు డీఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
కాగా, తొలుత ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 4 వ తేదీతో దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలన్న నిరుద్యోగుల డిమాండ్ మేరకు తెలంగాణ ప్రభుత్వం జూన్ 20 వ తేదీ వరకు ఈ అప్లికేషన్ గడువు పెంచింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 2 లక్షల 800మంది అభ్యర్థులు టీచర్ పోస్టులకు పోటీపడుతున్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కింద మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గత నెల 29న డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.