చిన్న నాయకులు లేదు పెద్ద నాయకులు లేరు… సామాన్యులు లేదు ధనికులు లేరు.. అందరిని కరోనా వెంటాడి వేధిస్తుంది. తాజాగా మరో కేంద్ర మంత్రి కరోనా బారిన పడ్డారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ కరోనా లక్షణాలతో పరిక్షలు చేయించగా ఆయనకు కరోనా ఉంది అని నిర్ధారణ అయింది. 60 ఏళ్ళ ఈ కేంద్ర మంత్రి రాజస్థాన్ లోని బికనేర్ నుంచి ఎంపీ గా ఉన్నారు.
ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ట్రామా సెంటర్ ఆఫ్ ఎయిమ్స్ లో అధికారులు చేర్చినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులకు కేంద్రంలో కరోనా రాగా ఈయన నాలుగో మంత్రి. హోం శాఖా మంత్రి అమిత్ షా కు ఇప్పటికే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే ధర్మేంద్ర ప్రాధాన్, కైలాష్ చౌదరి కూడా కరోనా బారిన పడ్డారు. వీరిలో అమిత్ షా కు మాత్రమే లక్షణాలు కనపడలేదు.