సంచలనం సృష్టిస్తున్న సెక్స్ టేప్ స్కాండల్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి HD రేవణ్ణను సిట్ అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరులోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, HD రేవణ్ణపై కేఆర్ నగర్ పిఎస్ లో కిడ్నాపింగ్ కేసు నమోదైంది.
కాగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి రేవణ్ణ, ఎంపీ ప్రజ్వల్ దాఖలు చేసిన పిటిషన్ ను బెంగళూరులోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం కొట్టివేసింది. మరోవైపు జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్పై రెండోసారి లుకౌట్ నోటీసు జారీ అయింది. ఈ నోటీసులతో ఆయన దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముంది.