మొన్ననే ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా హమాస్ మిలిటెంట్ ల మధ్యన మొదలైన యుద్ధం నెలరోజులు పూర్తి చేసుకుంది. ఈ యుద్ధం వలన అమాయకులు 11 వేల మంది వరకు మరణించారని తెలిసిందే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ పై మర్డర్ అటెంప్ట్ జరిగిన విషయం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఇది చాలా వైరల్ గా మారి అత్యంత చర్చనీయాంశంగా అయిందని చెప్పాలి. కానీ మహమ్మద్ అబ్బాస్ యూఎస్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకన్ ను కలిసిన అనంతరం ఈ దాడి జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే దురదృష్టవశాతూ ఈ దాడి కారణంగా మహమ్మద్ అబ్బాస్ బాడీ గార్డ్ మరణించారట.
ఒకవేళ సిబ్బంది అలెర్ట్ గా లేకపోయి ఉంటె పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ కు ప్రాణాపాయం ఉండేదంటూ తెలుస్తోంది. ఇకపై మహమ్మద్ అబ్బాస్ చాలా జాగ్రత్తగా ఉండాలంటూ సైనిక వ్యవస్థ రక్షణను మరింత టైట్ చేసింది.