MOVIE UPDATE: సంక్రాంతి కానుకగా “కెప్టెన్ మిల్లర్”…!

-

తెలుగు మరియు తమిళ భాషలలో అభిమానులను మెండుగా సంపాదించుకున్న నటులలో ధనుష్ కూడా ఒకరు అని చెప్పాలి. ధనుష్ తాజాగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “కెప్టెన్ మిల్లర్”, ఈ సినిమా నుండి కాసేపటి క్రితమే రిలీజ్ అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. తేదీ ఫలానా అని చెప్పకపోయినా ఏ నెలలో అన్నది చెప్పడం విశేషం. ఈ సమాచారం ప్రకారం కెప్టెన్ మిల్లర్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను 1930 – 40ల మధ్యలో జరిగిన ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ ను తీసుకుని డెవెలప్ చేసినట్లు డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ తెలియచేశారు. ఈ సినిమాను ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమా ఫుల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతోంది.. ధనుష్ తో పాటుగా ఇందులో సందీప్ కిషన్ కీలక పాత్రను చేస్తున్నారు. మరి ఈ సినిమా ధనుష్ కెరీర్ లో మరో హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news