తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. శనివారం భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సు నిమిత్తం నాగర్‌కర్నూల్ జిల్లాకు మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్‌కుమార్ హెలికాప్టర్‌లో వెళ్లారు.
కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డిపై పడి అగ్నిప్రమాదం సంభవించింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. దీంతో మంత్రి పొంగులేటికి, కాంగ్రెస్ నేతలకు పెను ప్రమాదం తప్పింది. లేకపోతే పెనుప్రమాదం సంభవించి ఉండేది. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.