తండ్రి చనిపోయినా కష్టపడి చదువుతున్న చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకుని మాజీ మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు.తండ్రి చనిపోయాడని.. తన తల్లి కష్టపడి చదివిస్తుందన్న ఓ చిన్నారి కథ విని స్టేజి పైనే కంటతడి పెట్టుకుని.. చిన్నారిని ఓదార్చిన మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే ఓదార్చారు.
సిద్దిపేటలో స్కూల్ విద్యార్థులకు ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి’ అనే అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలు క్రమశిక్షణగా ఉండాలని, పేరెంట్స్‌ను ఇబ్బంది పెట్టొద్దని.. చక్కగా చదువుకోవాలని కోరారు. డిసిప్లిన్ ముఖ్యమని ఈ విషయాన్ని ఎన్నడూ మరువద్దన్నారు.టీచర్లను గౌరవించాలని కోరారు. ఈ విషయంపై తనకు ప్రామిస్ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు.