వరల్డ్ కప్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవమైన ప్రదర్శనతో కనీసం సెమీస్ కు కూడా చేరకుండానే ఇంటికి వెళ్లిపోయింది. కానీ మాజీ క్రికెటర్లు అందరూ ఖచ్చితంగా పాకిస్తాన్ సెమీస్ చేరుకుంటుందని పూర్తిగా నమ్మకం ఉంచారు. కానీ అందరి నమ్మకాన్ని వమ్ము చేస్తూ, పాకిస్తాన్ ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అయిదవ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు వరల్డ్ కప్ లో ఘోర వైఫల్యానికి పూర్తి బాధ్యత వహిస్తూ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మూడు ఫార్మాట్ లకు రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా బాబర్ మాట్లాడుతూ, ఈ నిర్ణయం చాలా కఠినమైనదే అయినప్పటికీ ఇదే సరైన సమయమని భావిస్తున్నా అంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు.
ఇక ఈ వరల్డ్ కప్ లో బాబర్ ఒక ఆటగాడిగా మరియు కెప్టెన్ గా విఫలం అయ్యాడు. ఇతనితో పాటుగా మిగిలిన ఆటగాళ్లు కూడా సరైన సహకారం అందించలేదన్నది కాదనలేని వాస్తవం.