ఈ రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రచారంలో భాగంగా చందుర్తిలో జరిగిన ప్రజాశీర్వాద సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 30న జరగనున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పెట్టుకుని అన్ని పార్టీలు ప్రచారాలలో జోరుగా సాగుతున్నారు. కేటీఆర్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ వీరికి వ్యవసాయం గురించి బొత్తిగా ఏమీ తెలియదంటూ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా రైతులు పొలాల దగ్గర ఎప్పుడెప్పుడు కరెంట్ వస్తుందా అని రాత్రంతా జాగారం చేసేవారంటూ అప్పటి పరిస్థితులను గుర్తు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో తాగు నీటి కోసం కూడా ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. 55 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమీ చేసిందరూ ఎదురు ప్రశ్నించారు కేటీఆర్.
మా ప్రభుత్వంలోనే రైతులకు 24 గంటలు కరెంట్ అందించి..ఇప్పుడు దేశంలోనే వరి పంటను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణను నిలిపాము అంటూ కేటీఆర్ చాలా గర్వంగా చెప్పారు.