షాకింగ్ – బ్రేకింగ్: రాజధాని రైతుల సంచలన నిర్ణయం!

-

అమరావతి అంటూ అరచేతిలో స్వర్గం చూపించి.. ఫలితంగా భ్రమరావతిగా గ్రాఫిక్స్ కే పరిమితం చేసిన చంద్రబాబు… నేడు రాజధాని రైతులు పడుతున్న ఇబ్బందులకు ప్రత్యక్ష, పరోక్ష కారకుడని వైకాపా నుంచి విమర్శల దాడిపెరిగిపోతుంది. నిజంగా రైతుల త్యాగాలపై అంత ప్రేమ ఉన్న వ్యక్తే అయితే… ఉన్న ఐదేళ్లలో తాత్కాలిక భవనాలకు మాత్రమే ఎందుకు పరిమితం అవుతారని… వర్షాకాలం వస్తే సచివాలయంలో వర్షం కురవడం బాబు క్వాలిటీకి నిదర్శనమని చెబుతున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… అమరావతిలోనే పూర్తి రాజధాని అనే విషయంలో రాజధాని రైతులు వాస్తవాలు గ్రహించారని అంటున్నారు!!

ఎకరా భూమి 15 – 20 లక్షలు ఉండేది కాస్తా… అమరావతి పేరు చెప్పి తక్కువలో తక్కువ 2-5కోట్లకు అమ్మారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో స్థానిక రైతులు బావుకున్నది ఏమీ లేదని… సరికదా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భాగస్వాములు అయినవారు మాత్రం బావుకున్నారని విమర్శలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో… జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చేసరికి వ్యవహారం మొదటికి వచ్చింది!

దీంతో హుటాహుటిన అమరావతిలోని రైతుల వద్ద వాలిపోయిన బాబు… దీక్షలు ధర్నాలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈ దీక్షలు చేస్తున్నవారిలో మెజారిటీ ప్రజలు… “రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భాగస్వాములు అయినవారే” అని వైకపా నేతలు చెబుతున్నారు! అక్కడ దీక్షలు చేస్తున్న వారిలో రైతులు వాస్తవాలు గ్రహించాలని పిలుపునిచ్చారు. రైతులకు ఉన్న ఇబ్బందులు ఏమిటనేది సీఎం తో చెప్పుకోవచ్చని.. రైతులకు అన్యాయం చేసేది లేదని భరోసా ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వాస్తవాలు గ్రహించారో ఏమో కానీ… రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లోని రైతులు మళ్లీ వ్యవసాయం మొదలుపెట్టారు!!

ఈ విషయం వెలుగులోకి రావడంతో… టీడీపీ నేతలు, స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భాగస్వాములు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారని తెలుస్తోంది. అవును… రాయపూడి, బోరుపాలెం, మంగళగిరి, పెనుమాక, ఎర్రబాలెం లాంటి ప్రాంతాల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇలా మిగిలినవారు కూడా భ్రమల్లోంచి బయటకు వచ్చి, మొసపోయిన మట్టుకు చాలని గ్రహించి.. రైతులకు అన్యాయం చేయమని రాష్ట్రప్రభుత్వం చెబుతున్న మాటలు నమ్మి.. వాస్తవ ప్రపంచంలోకి వస్తే మంచిదని పలువురు సూచిస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news