BREAKING NEWS :”గేమ్ చేంజర్” మూవీ నుండి సాంగ్ విడుదల వాయిదా !

-

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న వాంటెడ్ మూవీ “గేమ్ చేంజర్” చిత్ర బృందం కాసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ ను అభిమానులకు తెలియచేస్తూ ఒక లెటర్ ను విడుదల చేసింది. వాస్తవంగా ఈ సినిమా నుండి “జరగండి….” సాంగ్ ను ఈ దీపావళికి రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ఆలోచించారు. అందుకు తగ్గ పనులలో చాల బిజీ అయ్యారు.. కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన ఈ సాంగ్ ను విడుదల చేయడం లేదంటూ మేకర్స్ ఒక లెటర్ ను విడుదల చేశారు. ఈ లెటర్ లో ఉన్న సమాచారం ప్రకారం వివిధ సంస్థలతో ఆడియో డాక్యుమెంటేషన్ సమస్యల కారణంగా ప్రస్తుతానికి ఈ పాటను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకముగా తీసుకుని చేస్తున్న టీం ప్రతి ఒక్కటీ ది బెస్ట్ గా ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ వాయిదా అని చెబుతున్నారు. తర్వాత ఎప్పుడు ఈ సాంగ్ ను విడుదల చేస్తారు అన్న విషయం కూడా చెప్పలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version