మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు కొండల్ రెడ్డి కలిసి హైదరాబాద్ శివార్లలో భూ దందాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేసులు నమోదు చేసే దిశగా అధికారులు సమాయత్తమవుతున్నారు. ఆయన మీద పలు కేసులు కూడా పెట్టే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది.
ముందు నుంచి రేవంత్ రెడ్డి కెసిఆర్ సర్కార్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన అవినీతి ఆరోపణలు ప్రభుత్వం మీద చేసి చివరికి తన భూముల విషయంలో దొరికిపోయారు. గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు విమర్శలు చేసిన సందర్భంలో ఎప్పుడో భూములు కొన్నాను అని చెప్పిన ఆయన ఇప్పుడు అనూహ్యంగా భూముల విషయంలో దొరికిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయ౦.
ఇప్పటి వరకు ఆయనకు తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు వస్తాయని అందరూ భావించారు. ఎంత మంది పోటీలో ఉన్నా సరే ఆయనకు ఫాలోయింగ్ ఉన్న నేపధ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఆయనకు అవకాశం ఇవ్వాలని భావించారు. కాని ఇప్పుడు అవినీతి ఆరోపణలతో ఆయనకు ఆ పదవి దక్కే అవకాశం కనపడట౦ లేదు. ఇప్పటికే లాబీయింగ్ కూడా ఆయన కర్ణాటక నుంచి చేసారు.
కాని అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తికి ఆ బాధ్యతలు ఎందుకు అనే భావనలో అధిష్టానం ఉంది. అలాంటి వ్యక్తికి టీ పీసీసీ చీఫ్ ఇవ్వొద్దని కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీమంత్రి శ్రీధర్ బాబు వంటి వాళ్లు టీ పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. అలాగే హనుమంత రావు కూడా ఈ జాబితాలో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.