కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న దేశాల్లో అమెరికా ముందు వరుసలో ఉంటుంది. ఇప్పుడు ఆ దేశానికి తన ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలి అంటే వ్యాక్సిన్ మినహా ఆ దేశానికి మరో మార్గం అనేది కనపడటం లేదు. అందుకే ఇప్పుడు అమెరికా మరో కీలక ఒప్పందం చేసుకుంది వ్యాక్సిన్ కోసం.
తన ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి గానూ ఔషధ తయారి దారు… మోడెర్నా ఇంక్‌తో యునైటెడ్ స్టేట్స్ 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ ని కొనుగోలు చేయడానికి గానూ 1.5 బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ మరియు వైట్ హౌస్ మంగళవారం ప్రకటించాయి. ఇప్పటికే జాన్సన్ & జాన్సన్, ఆస్ట్రాజెనెకా పిఎల్‌సి, ఫైజర్ ఇంక్ మరియు బయోఎంటెక్ ఎస్‌ఇ, మరియు సనోఫీ ఎస్‌ఎ మరియు గ్లాక్సో స్మిత్‌క్లైన్ పిఎల్‌సిలతో అమెరిక ఒప్పందం చేసుకుంది. యుఎస్ ప్రభుత్వం గతంలో మోడెర్నాకు తన పరిశోధన ప్రయత్నాలకు నిధులు సమకూర్చడానికి గానూ సుమారు ఒక బిలియన్ డాలర్ల మొత్తం చెల్లించింది.