వరల్డ్ కప్ లో మరో మ్యాచ్ ఏకపక్షముగా సాగింది. ఈ రోజు పుణేలో ఇండియా మరియు బంగ్లాదేశ్ ల మధ్యన జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ సేన స్పష్టమైన కమాండ్ తో అన్ని విభాగాలలోనూ బంగ్లాను చిత్తు చేసి వరుసగా నాలుగవ విజయాన్ని అందుకుంది. ముందుగా బంగ్లా నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని మరో 7 వికెట్లు మరియు 9 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించి ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్ మోగించింది. ఇండియా బ్యాటింగ్ లో రోహిత్ శర్మ (48), గిల్ (53) మంచి ఆరంభాన్ని ఇవ్వగా కోహ్లీ (103) మరియు రాహుల్ (34) లు జాగ్రత్తగా ఆడి ఇండియాను గెలిపించారు. కోహ్లీ తన సెంచరీ కి మరో మూడు పరుగులు అవసరం అయిన సమయంలో సిక్సు కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశేషం. ఈ వరల్డ్ కప్ లో ఇండియాకు ఎదురే లేదని చెప్పాలి..
ఈ విజయంతో మళ్ళీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ను అధిగమించి మొదటి స్థానానికి చేరుకుంది టీం ఇండియా. ఇక ఇండియా తన తర్వాత మ్యాచ్ లలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా మరియు నెదర్లాండ్ లతో ఆడనుంది.