మోసం చేసిన భ‌ర్త‌…న్యాయం చేయాంటూ అత్తింటి ముందు భార్య పూజ‌లు..!

భ‌ర్త‌లు మోసం చేస్తే భార్య‌లు మ‌హిళా సంఘాల‌తో క‌లిసి అత‌డి ఇంటి ముందు న్యాయ‌పోరాటానికి దిగుతారు. కానీ తాజాగా ఓ భార్య త‌న భ‌ర్త మోసం చేసాడ‌ని వినూత్న రీతిలో నిర‌స‌న‌కు దిగింది. ఈ ఘ‌ట‌న ఒడిసాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే….సునీత్‌ సాహు అనే డాక్ట‌ర్ అప‌స్విని దాస్ అనే యువ‌తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడు నెల‌ల పాటు ఈ జంట వైవాహిక జీవితం సాఫీగానే సాగిపోయింది. అయితే కొద్దిరోజుల క్రితం సునీత్ చెప్పాపెట్ట‌కుండా ఇంటినుండి పారిపోయి తిరిగి రాలేదు. దాంతో భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అయినా ఎలాంటి ఫ‌లితం లేకుండా పోయింది.

దాంతో ఆ మ‌హళ సునీత్ ఇంటి మందు మెట్ల‌పై దేవుళ్ల ఫోటోలు పెట్టి వినూత్న రీతిలో న్యాయ‌పోరాటానికి దిగింది. సంప్రదాయ వస్త్రాలు ధరించి మెట్లపైనే పండ్లు, ఫ‌లహారాలు పెట్టి ల‌క్ష్మీదేవి ఫోటోకు పూజ‌లు చేస్తూ త‌న‌కు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. త‌న‌కు న్యాయం జ‌రిగేవర‌కూ పోరాటం ఆప‌ను అని చెబుతోంది. అంతే కాకుండా ఆ మ‌హిళ‌కు మ‌హిళా సంఘాలు కూడా మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి.