ఏపీ శాసన సభలో చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్రవివాదాస్పదం అవడం తెలిసంది. ఆ తరువాత చంద్రబాబు ఏడవడంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయం తారాస్థాయికి చేరింది. తదనంతరం నందమూరి ఫ్యామిలీ మీడియా ముఖంగా వైసీపీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు.
తాజాగా చంద్రబాబు సతీమణి ఏపీ ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. లేఖలో భువనేశ్వరీ ఇలా పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరేపేను ధన్యవాదాలు తెలిపారు భువనేశ్వరి. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, చెల్లికి, కూతురుకు జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేనన్నారు. చిన్నతనం నుంచి అమ్మ, నాన్న మమ్మల్ని విలువలతో ఉంచారన్నారు. నేటికి వాటిని పాటిస్తామన్నారు. విలువలో కూడిన సమాజం కోసం ప్రతీ ఒక్కరూ క్రుషి చేయాలన్నారు. కష్టాల్లో ఆపదల్లో నిలబడిన వారికి అండగా నిలవాలని భువనేశ్వరీ లేఖలో కోరారు. ఇతరుల వ్యక్తిత్వానికి, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని, నాకు జరిగిన అవమానం మరెవరికీ జరుగకూడదని ఆశిస్తున్నట్లు భువనేశ్వరీ లేఖలో పేర్కొన్నారు.