సుష్మా, జైట్లీ తరువాత “మోడీ”…. అంటూ సంచలన వ్యాఖలు…!!!

-

భారతదేశంలో ఆర్టికల్ 370 రద్దు బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఆ ఊహ ఒక్క మోడీ అమిత్ షా ల మధ్య నిగూఢంగా దాగి ఉండుంటుంది. ఎలాగైనా సరే ఆర్టికల్ 370 రద్దుతో పూర్తిస్థాయిలో కాశ్మీర్ పై పట్టు సాధించాలని, పాకిస్తాన్ ఆగడాలకు చెక్ పెట్టాలని భావించిన ప్రధాని మోడీ అందుకు తగ్గట్టుగా పావులను చెకచెకా కదిపారు. ఎట్టకేలకు ఆర్టికల్ 370 రద్దయింది. ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్ధు అయ్యిందో, ఆ క్షణం మొదలు పాకిస్తాన్ భారత్ పై ఏదో రకంగా మాటల యుద్ధానికి పాల్పడుతోంది.

ఇమ్రాన్ ఖాన్ మొదలు పాకిస్తాన్ మంత్రులు అందరూ నరేంద్ర మోడీ పై ఆయన తీసుకున్న నిర్ణయంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కోవలోకే ఇప్పుడు బ్రిటిష్ ఎంపీ కూడా చేరారు. పాకిస్తాన్ మూలాలు ఉన్న బ్రిటిష్ ఎంపీ నజీర్ అహ్మద్ ప్రధానమంత్రి మోడీ పై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి భారతదేశ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు.

బ్రిటిష్ ఎంపీ నజీర్ అహ్మద్ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. సుష్మా స్వరాజ్ జైట్లీ తరువాత టార్గెట్ ప్రధానమంత్రి మోడీ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ దారుణమైన వ్యాఖ్యలపై భారతదేశ పౌరులు స్పందిస్తున్నారు. ఇక దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ లీడర్ మిలింద్ డియోరా కూడా స్పందించారు. నెటిజన్లు సైతం నజీర్ అహ్మద్ తిట్ల వర్షం కురిపిస్తున్నారు.

Claims of sorcery, Jadoo , magic, witchcraft, on @BJP4India by opposition Jaitley, Gaur former CM of Madhya Pradesh, Shushma Swaraj , Atal Vajpayee , Manohar Parrikar CM Goa and Arun Jaitley … have all died in the last one year hey @narendramodi is next https://t.co/Kqfco5RXk9

— Lord Nazir Ahmed (@nazir_lord) August 26, 2019

బీజేపీ పై ప్రతిపక్ష పార్టీ చేతబడి లాంటి పనులు ఎదో చేసిందని అందుకే బీజేపీలో దిగ్గజాలు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు అంటూ ట్వీట్ చేశారు. వాజ్పేయి , మనోహన్ పారికర్ , సుష్మా ,జైట్లీ, నెక్స్ట్ మోడీ నే అంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దాంతో కేంద్ర మంత్రి ఈ ట్వీట్ పై ఘాటుగా స్పందిచారు. హౌస్ ఆఫ్ లార్డ్స్ లోకి నువ్వు ఎలా వెళ్ళావో మాకు ఇప్పటికీ అర్థం కావడంలేదు. ఎవరిని అయినా మేనేజ్ చేసి ఎంపీగా గెలిచావా అంటూ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version